గురువారం, 7 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (10:42 IST)

ప్రేక్ష‌కుడికి ఆనందం, ఆలోచ‌న కలిగించే కథలే తీస్తా : ద‌ర్శ‌కుడు రామ్ రెడ్డి పన్నాల

Ram Reddy Pannala at set
నేడే విడుద‌ల‌' టైటిల్‌తోనే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యేలా చేసిన ద‌ర్శ‌కుడు రామ్ రెడ్డి పన్నాల.  ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా నిల‌బ‌డే వారు కొంద‌రే. ఆడియ‌న్స్ ఇప్పుడు ఏ త‌ర‌హా కంటెంట్‌కు క‌నెక్టు అవుతారో తెలుసుకుని అలాంటి క‌టౌట్‌ను నిల‌బెట్టాలి. అప్పుడే సూప‌ర్ హిట్టు కొట్టొచ్చు. బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేయోచ్చు. అలాంటి స‌త్తా ఉన్న వ‌ర్థ‌మాన ద‌ర్శ‌కుల్లో 'రామ్ రెడ్డి పన్నాల' ఒక‌రు. సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ప్రధానంగా నష్టపోతోందో, ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని, దాని చుట్టూ అల్లుకున్న కథనం, ఎంగేజింగ్ నడిపించడంలో ఇటీవ‌ల విడుద‌లైన‌ 'నేడే విడుద‌ల‌' సినిమాతో దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల విజయం సాధించారు. ఫస్ట్ మూవీతోనే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల చెప్పిన విశేషాలు. 
 
-  మాది జగిత్యాల జిల్లాలోని లక్ష్మిపూర్ గ్రామం. మాది రైతు కుటుంబం. అమ్మ, నాన్న వ్వవసాయదారులు. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఈ రంగానికి వ‌చ్చాను.
- నేను డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే డైరెక్టర్ మారుతీ టాకీస్‌లో కో-డైరెక్టర్ గా పనిచేసాను. నాకు డైరెక్టర్ సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే సుకుమార్ గారికి ఏకలవ్య శిష్యుడిని.
 
-  'నేడే విడుద‌ల‌' టైటిల్‌తోనే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో పాటు, మంచి మెసేజ్ కూడా వుంది. 
 
- విడుద‌ల‌య్యాక‌  సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అని చెబుతున్నారు. సినిమాలో ముఖ్యంగా కామెడీ నచ్చి చాలా మంది ప్రేక్ష‌కులు రిపీట్‌గా చూస్తున్నారు. సినిమా విడుద‌ల‌య్యాక అన్ని కేట‌గిరి ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇలాంటి సినిమాలే చేయ‌లంటూ చాలా మంది నుంచి నాకు కాల్స్, మెసెజ్‌లు వ‌చ్చాయి. ఈ మూవీ పూర్తిగా ఫ్యామిలీ కామెడీ డ్రామా. అందుకే అందరికి నచ్చింది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జగిత్యాల లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
 
- సినిమాకు వ‌చ్చిన ప్రేక్ష‌కుడిని ఆనందింప‌జేయ‌డం ముఖ్య‌మ‌నుకుంటాను. ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు మెసెజ్ అందించాల‌నుకుంటాను. ప్రేక్ష‌కులు ఆనందపడేలా, ఆలోచింపజేసేలా వుండే సినిమాలు చేయాలనుకుంటున్నాను.