1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

'పుష్ప' నిర్మాత - డైరెక్టర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

it raids - sukumar
"పుష్ప" చిత్ర నిర్మాణ సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలతో పాటు నిర్మాతగా మారిన దర్శకుడు కె.సుకుమార్ కార్యాలయంలో కూడా ఈ సోదాలు సాగుతున్నాయి. గతంలో కూడా మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో కూడా ఐటీ దాడులు జరిగిన విషయం తెల్సిందే. 
 
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వరుస చిత్రాలు నిర్మిస్తుంది. ఈ యేడాడి సంక్రాంతి పండుగకు చిరంజీవితో "వాల్తేరు వీరయ్య", బాలకృష్ణతో "వీరసింహారెడ్డి" చిత్రాలను నిర్మించింది. ఈ రెండూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇపుడు సుకుమార్ సొంత బ్యానర్‌, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి "పుష్ప" చిత్రం రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. 
 
ఇదిలావుంటే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో "ఉస్తాద్ భగత్ సింగ్" అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. వరుస భారీ హిట్స్ చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సినిమా నిర్మాణంతో పాటు పంపిణీ సంస్థను కూడా నడిపిస్తుంది.