సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (17:09 IST)

ఒడిశాలో రైలు దుర్ఘటన బాధితులకు రక్త దానం ఇవ్వండి : చిరంజీవి పిలుపు

chiranjeevi prkatana
chiranjeevi prkatana
ఒడిశాలో రైలు ఢీకొన్న వార్తతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మెగా స్టార్ చిరంజీవి, రాంచరణ్, మహేష్ బాబు. సినిమా ఇండస్ట్రీలో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  చిరంజీవి తన అభిమానులకు ఇలా పిలుపు  ఇచ్చారు. దగ్గరలోని అభిమాలు అంతా రక్త దానం చేయాలనీ చెప్పారు. ఇందుకు హైద్రాబాద్లోని తన బ్లడ్ బ్యాంకు నుంచి సాయం కావాలన్న చేస్తానని తెలిపారు. అలాగే రామ్ చరణ్ కూడా అభిమానులు రక్త దానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 
 
మహేష్ బాబు ట్విట్టర్ లో మాట్లాడుడూ, ఒడిశాలో రైలు ఢీకొన్న వార్తతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు  తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మన రైల్వే వ్యవస్థల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తుచేస్తుంది అన్నారు.