గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (07:44 IST)

ఒడిశాలో ఘోర ప్రమాదం- 233 మంది మృతి -900 మందికి గాయాలు

Train
Train
ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది మృతి చెందగా మరో 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు తెలిపారు. 
 
బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఒక గూడ్స్ రైలు రాత్రి 7 గంటల సమయంలో ఢీకొనడంతో ఈ ఘోరం జరిగిపోయింది. తొలుత బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పడంతో పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. 
 
అదే సమయంలో ఎదురుగా వస్తున్న షాలీమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టింది. ఆపై మరో గూడ్స్ రైలు కూడా వీటిని ఢీకొట్టడంతో.. మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత పెరిగిపోయింది.