శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (16:18 IST)

రామ్‌గోపాల్‌ వర్మ ఇండస్ట్రీకి పట్టిన సైతానా ?

Ram Gopal Varma, Mahi.V. Raghav,
Ram Gopal Varma, Mahi.V. Raghav,
ఒకప్పుడు సినిమా అంటే గౌరవం, ఎడ్యుకేట్‌గా కథలు  వుండేవి. రాను రాను కాలాన్ని బట్టి మనుషులు మారి హింస, శృంగారంపేరుతో సెక్స్‌ వరకు వెళ్ళాయి. ఇప్పుడు మరీ దిగజారిపోయింది. భాషతోపాటు సన్నివేశాలు కూడా దారుణంగా తయారయ్యాయి. ఇటీవలే సైతాన్‌ అనే వెబ్‌ సినిమా రూపొందింది. దానికి మహి.వి.రాఘవ్‌ దర్శకుడు. ఈయన ఆంధ్రలోని ఓ ప్రముఖ రాజకీయనాయకుడి బంధువు. మొదటగా యాత్ర అనే సినిమా చేశాడు. అమెరికా రిటర్న్ కనుక యూత్‌ ఆలోచనలకు అనుగుణంగా సహజీవం కాన్సెప్ట్‌తో సినిమా చేశాడు. అది బెడిసికొట్టింది.
 
ఇక ఇప్పుడు అంతకుమించి అన్నట్లు ఓ సైతాన్‌ అనే వెబ్‌ సినిమా చేశాడు. ఇటీవలే ట్రైలర్‌ విడుదలైంది. అది చూస్తే కుటుంబంలో పిల్లలు తలదించుకోవాల్సిందే. ట్రెలర్‌ అంతా నరుక్కోవడాలు, బూతులు, సెక్స్‌ చేయడమే. మచ్చుకు ఒకటి.. ‘గొళ్ళెం అంతదట్లేదు ఎలా దెంగుతావురా!। అంటూ ఓఅమ్మాయి తన దగ్గరకువచ్చిన అబ్బాయితో అంటుంది. ఇలా ట్రైలర్‌తో చాలామటుకు ఇంతకంటే దారుణమైన సంభాషణలు రాశారు. సరిగ్గా ఈసినిమాను ప్రమోట్‌ చేయడానికి అలంటి ఆలోచనలు ఉన్న రామ్‌గోపాల్‌ వర్మ కంకణం కట్టుకున్నాడు. 
 
అందుకే ఆ సినిమా దర్శకుడు రాఘవతో ఈరోజు కలసి తన ఆధ్వర్యంలో నడిచే ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో ఇంటర్వ్యూచేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమాను తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. వర్మ ఆద్వర్యంలో నడిచే ఛానల్‌కూడా ఎ.పి.కి చెందిన రాజకీయనాయకుడిదే. సో. ఇప్పటికే వర్మ రాష్ట్రంలోని యువతను పక్కదోవపట్టించే విధంగా పలు రకాలుగా ప్రవర్తించాడు. మరి ఈ సినిమా ప్రమోషన్‌తో సభ్య సమాజానికి ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలిఅంటాడేమో.. చూడాలి. వర్మ ఇలా చేస్తున్నాడనగానే టాలీవుడ్‌లో ప్రముఖులు వర్మ ఇండస్ట్రీకి పట్టిన సైతాన్‌ అంటూ కాప్షన్‌ అతనికి సరిపోయేట్లుగా స్పందిస్తున్నారు.