బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (18:52 IST)

గోవా ప్రియుడితో కలిసి అమలా పాల్ బర్త్‌డే సెలెబ్రేషన్స్...

amala paul jagat
అందాల భామ అమలాపాల్ మరోమారు పెళ్లిపీటలెక్కనున్నారు. తన స్నేహితుడు జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారు. గత కొంతకాలంగా ఆమె జగత్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. అమలా పాల్ తన 32వ పుట్టిన రోజు వేడుకలను గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా జగత్ పెళ్లి ప్రపోజల్ చేయగా, ఆమె ఒకే చెప్పారు. 
 
దీనికి సంబంధించిన వీడియోను జగత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. 'ఈరోజు అమలాపాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వీడియోను అందరితో పంచుకున్నాడు. దీనికి వెడ్డింగ్ బెల్స్ అనే హ్యాష్ ట్యాగ్‌'ను జత చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
amala paul jagat
 
మలయాళ భామ అమలాపాల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తమిళ, మలయాళ చిత్రాల్లో సైతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. కెరీర్ టాప్ గేర్‌లో దూసుకుపోతున్న సమయంలో తమిళ దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకుంది. 
 
అయితే, ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత తన స్నేహితుడు జగత్ ప్రేమలో పడింది. ఆ తాజాగా అతడితో పెళ్లికి ఓకే చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
am