గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:16 IST)

రెండో పెళ్లి ట్రోల్స్.. ఎవడు పట్టించుకుంటాడు.. వాటిని..?

Ashish Vidyarthi
రెండో పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి ప్రస్తుతం నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కుంటున్నాడు. మే 25న, ఆశిష్ విద్యార్థి, 57 సంవత్సరాల వయస్సులో, వ్యవస్థాపకురాలు రూపాలి బారువాను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
ఇంకా తన ట్రోల్స్‌కు సంబంధించి ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. మా మధ్య ప్రేమ ఆప్యాయతలు వున్నాయి. దేనినీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఏది సంతోషమో దాన్నే చేస్తాం.. అంటూ పేర్కొన్నారు. 
 
ఆశిష్ విద్యార్థి భార్య రూపాలి కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. "నేను ట్రోల్‌లను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు అలాంటి వ్యక్తులు కూడా తెలియదు. వారు అందరికీ స్పష్టంగా కనిపించని విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. 
 
మేము దేనినీ స్పష్టం చేయాల్సిన అవసరం లేదు. ప్రతికూల వ్యాఖ్యలను చదవడం మానేసి, తన సన్నిహితుల మద్దతు నుండి బలాన్ని పొందాను" అని పేర్కొంది. దీంతో నెటిజన్లకు ఆశిష్ విద్యార్థి దంపతులు బాగానే బుద్ధి చెప్పారని సినీ జనం అంటున్నారు.