గురువారం, 8 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 26 మే 2023 (09:15 IST)

60వ ఏట పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి..

Ashish Vidyarthi
Ashish Vidyarthi
జాతీయ అవార్డును గెలుచుకున్న ఆశిష్ విద్యార్థి 60వ ఏట పెళ్లి చేసుకున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా, ట్రావెల్, ఫుడ్ వ్లాగర్‌గా సుపరిచితుడైన ఆశిష్ విద్యార్థి.. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో రానా దగ్గుబాటి పాత్రకు అన్నయ్యగా నటించాడు. అతను అస్సాంకు చెందిన రూపాలి బారువాను వివాహం చేసుకున్నాడు.
 
ఆమె కోల్‌కతాలో నివసిస్తున్నారు. ఫ్యాషన్ స్టోర్‌ను ఆమె నడుపుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆశిష్ మొదటి భార్య రాజోషి కూడా అస్సాంకు చెందినవారు. ఆమె ఒకప్పటి అస్సామీ నటి శకుంతల బారువా కుమార్తె. ఆమెకు దూరమైన ఆశిష్ విద్యార్థి.. 60వ ఏట వివాహం చేసుకున్నాడు. 
 
విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మంచి మార్కులు కొట్టేసిన ఆశిష్ విద్యార్థి... 'సర్దార్' (1993)లో కనిపించాడు. అలాగే 11 భాషలలో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు.