శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (19:18 IST)

గుండెపోటుతో నితీష్‌ పాండే మృతి..

Nitesh Pandey
Nitesh Pandey
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నితీష్‌ పాండే (51) మృతి చెందాడు. గుండెపోటు కారణంగా ముంబైలోని ఇగత్‌పురిలో నితీష్ పాండే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్మాత సిద్ధార్థ్ తెలియజేశారు. నితీష్ పాండే మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా కుమావోన్‌లో జన్మించిన అశ్విని కల్సేకర్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 2002లో విడాకులు ఇచ్చి.. స్టజూ అనే టీవీ షోలో పరిచయమైన నటి అర్పితా పాండేని 2003లో వివాహం చేసుకున్నాడు. తన పాతికేళ్ల నటనా జీవితంలో ఎన్నో టీవీ షోలలో నటించాడు. 
 
స్మాల్ స్క్రీన్‌లోనే కాకుండా ఓం శాంతి ఓం, దబాంగ్ 2 వంటి చిత్రాల్లో నటించారు. నితీష్ పాండే నటుడిగా మాత్రమేకాకుండా డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా నడిపాడు.