గురువారం, 8 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 24 మే 2023 (19:34 IST)

బాయ్‌ఫ్రెండ్‌తో వైభ‌వి ఉపాధ్యాయ కారులో జర్నీ.. హిమాచల్ లోయలో పడి?

టీవీ నటులు ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ టీవీ న‌టి వైభ‌వి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం ఆమె కారు ప్రమాదంలో మృతి చెందినట్లు ఫేమ‌స్ టీవీ షో ప్రొడ్యూస‌ర్ జేడీ మ‌జీతియా ధ్రువీకరించారు. 
 
తన భాయ్‌ఫ్రెండ్‌తో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిందని జేడీ మ‌జీతియా తెలిపారు. వైభ‌వికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. భాయ్‌ఫ్రెండ్‌తో వెళ్తున్న ఆమె కారు హిమాచ‌ల్ లోయ‌లో ప‌డటం పట్ల ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా టీవీ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.