సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (20:08 IST)

చంద్రబాబుకు గ్రహణం పట్టింది.. క్షమాపణలు చెప్పిన గంగవ్వ

Gangavva
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అసలు ఏం జరిగిందంటే..? ఉగాది రోజు ఓ తెలుగు ఛానల్‌లో ప్రసారమైన కార్యక్రమంలో చంద్రబాబు జాతకం చెప్పమన్నారు. తాను చెప్పలేనని గంగవ్వ చెప్పారు. అయితే చంద్రబాబుకు గ్రహణం పట్టిందని చెప్పారు. 
 
దీంతో ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని గంగవ్వ చంద్రబాబును కోరారు. 
 
టీవీ ఛానెల్ వాళ్లు అనమంటేనే తాను అన్నానని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ మాట జారితే క్షమించాలంటూ చంద్రబాబును క్షమాపణలు కోరారు.