1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (11:46 IST)

అందుకే రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను.. రేణు దేశాయ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోవట్లేదు. తన కొడుకు అకీరా, కూతురు ఆద్యల బాధ్యతలపై ఆమె పూర్తిగా దృష్టి సారించారు. మరోవైపు కొంత కాలం క్రితం ఒక వ్యక్తితో ఆమె పెళ్లికి సిద్ధమయిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఆ పెళ్లి జరగలేదు. నిశ్చితార్థం రద్దయినట్టు ఆమె తెలిపారు. పవన్ నుంచి తాను విడిపోయే సమయానికి అకీరా, ఆద్య చిన్న పిల్లలని రేణు చెప్పారు. రెండో పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు చెపుతుండేవారని వెల్లడించారు. 
 
పెళ్లి చేసుకుంటే ఆయనతో పాటు ఆద్యకు కూడా సమయం కేటాయించాల్సి ఉంటుందని.. అది చాలా కష్టమనిపించిందని చెప్పారు. అందుకే రెండో పెళ్లిని రద్దు చేసుకున్నానని తెలిపారు. మరో రెండు, మూడు ఏళ్ల తర్వాత రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానన్నారు.