1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress Sadha Joins Abdul Majith's 'Torchlight

టార్చ్‌లైట్‌లో వేశ్యగా కనిపించనున్న సదా...

నితిన్, సదా, గోపీచంద్ కాంబినేషన్‌లో తేజ దర్శకత్వం వహించిన జయం సినిమా గుర్తుంది కదూ. ఈ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న సదా ఆపై తెలుగు, తమిళ సినిమాల్లో అగ

Actress Sadha
నితిన్, సదా, గోపీచంద్ కాంబినేషన్‌లో తేజ దర్శకత్వం వహించిన జయం సినిమా గుర్తుంది కదూ. ఈ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న సదా ఆపై తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఈమె ప్రస్తుతం ఆఫర్లు అంతంత మాత్రంగానే వున్నాయి. కొన్ని షోల జడ్జిగా వ్యవహరించిన సదా.. ఛాన్సుల కోసం ఆత్రుత ఎదురుచూస్తుంది. 
 
తాజాగా ఈమెకు తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ షోలకు పరిమితమైన సదా.. ఇక లాభం లేదని.. సెక్స్ వర్కర్‌గా నటించనుంది. ఈ పాత్ర ద్వారా తప్పకుండా తనకు గుర్తింపు లభిస్తుందని ఆమె భావిస్తోంది.

టార్చ్ లైట్‌ అనే పేరిట రూపుదిద్దుకుంటున్న తమిళ చిత్రంలో సదా సెక్స్ వర్కర్‌గా కనిపించనుంది. ఇందులో ఉదయ, రిత్విక, వెంకటేష్, సుజాత తదితరులు నటిస్తున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
నాకు చైతూకూ పెళ్లి ఎపుడో జరిగిపోయింది.. సమంత