1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Don't come my marriage says Samanta

నా పెళ్ళికి రావొద్దండి.. ప్లీజ్.. సమంత

ఇదేంటి.. పెళ్ళికి ఎవరినైనా పిలుస్తారు. అందులోనూ శత్రువులైనా పెళ్ళి పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తారు. అలాంటిది పెళ్ళికి రావొద్దంటూ సమంత చెప్పడమేంటి అనుకుంటున్నారా.. నిజమే. అక్టోబర్ 6వ తేదీన సమంత - నాగచైతన్యల

samanta
ఇదేంటి.. పెళ్ళికి ఎవరినైనా పిలుస్తారు. అందులోనూ శత్రువులైనా పెళ్ళి పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తారు. అలాంటిది పెళ్ళికి రావొద్దంటూ సమంత చెప్పడమేంటి అనుకుంటున్నారా.. నిజమే. అక్టోబర్ 6వ తేదీన సమంత - నాగచైతన్యల వివాహం జరుగనుంది. ఇప్పటికే పెళ్ళి పత్రికలు సిద్ధమై అక్కినేని, సమంత ఇంటికి చేరుకున్నాయి. ఇప్పటికే నాగార్జున కొన్ని షరతులను సమంతకు పెట్టారట. 
 
పెళ్ళికి ఎవరు పెడితే వారిని పిలవద్దండి.. అందరూ ప్రముఖులే వివాహానికి హాజరవుతారు. పత్రికలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అవసరమైన వారినే పిలవాలంటూ అటు సమంతకు, ఇటు నాగచైతన్యకు చెప్పారట నాగార్జున. దీంతో సమంత సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా పెళ్ళి పత్రిక అడిగితే ఇలా చెబుతోందట. నా పెళ్ళికి రావొద్దండి.. ప్లీజ్.. ఏమీ అనుకోకండి అంటూ ముఖం మీద చెప్పేస్తోందట. అంతేకాదు ప్రత్యేక విందు ఇస్తున్నాం.. అప్పుడు కావాలంటే అందరూ రావచ్చంటూ చెప్పుకొస్తేందట.
 
పెళ్ళికాకముందే మామ నాగార్జున చెప్పిన మాటలను తూచా తప్పకుండా సమంత పాటిస్తుందంటే పెళ్ళయిన తర్వాత ఎలా ఉంటుందోనని సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇప్పటికే సమంత-నాగచైతన్యల పెళ్ళి పత్రికలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెల్సిందే. 
About Writer
tj
తర్వాతి కథనం
ఎన్టీఆర్ 'బిగ్ బాస్'... వామ్మో వాళ్లని చూళ్లేక చస్తున్నాం... మాకో హాటీ కావాలి టైగరో...