రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా
Kiara-Sid Malhotra
అత్యంత గొప్ప కానుకతో మరోసారి ఆశీర్వదించబడ్డాం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతాభావంతో నిండిపోయాయని కియారా పేర్కొన్నారు. ఆమె, సిద్ధార్థ్, సరాయా కలిసి చిన్న పిల్లల బూటీలను (అల్లిన బూట్లు) పట్టుకుని ఉన్న ఫోటోను దీనికి జత చేశారు.
నవంబర్ 2025లో తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన ఏడాది లోపే ఈ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత కియారా వెంటనే పనిలో నిమగ్నమయ్యారు. చివరిగా టాక్సిక్ సినిమాలో కనిపించారు. కియారా, సిద్ధార్థ్ 2021లో వచ్చిన హిట్ చిత్రం షేర్షా షూటింగ్ సమయంలో మొదటిసారి కలుసుకున్నారు. వారిద్దరి మధ్య సంబంధం గురించి చాలా కాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నప్పటికీ, అప్పట్లో వారిలో ఎవరూ దీని గురించి బహిరంగంగా స్పందించలేదు.
2022లో కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్, కియారాను సిద్ధార్థ్ ప్రేమికురాలిగా పేర్కొనడంతో వారి బంధంపై స్పష్టత వచ్చినట్లయింది. ఏళ్ల తరబడి తమ బంధాన్ని గోప్యంగా ఉంచిన తర్వాత, ఈ జంట 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన సంప్రదాయ వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. ఇప్పుడు, తమ కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడిని ఆహ్వానించడానికి ఈ జంట సిద్ధమవుతోంది.
