1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Monalisa's allegations against director Sanoj Mishra

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

Monalisa
Monalisa
మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా బాలీవుడ్ సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. అతను తనను వేధించాడని వాపోయింది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తతో పాటు మీడియా ముందుకు వచ్చిన మోనాలిసా మిశ్రా వల్ల తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బట్టబయలు చేసింది. 
 
ప్రయాగరాజ్‌ కుంభమేళా ఫేమ్ మోనాలిసా మార్చి 11న తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెను సినిమా రంగానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సనోజ్ మిశ్రా... మోనాలిసా వివాహాన్ని లవ్ జీహాద్‌తో పోల్చాడు. 
 
తాజాగా సనోజ్ మిశ్రా బండారాన్ని మెనాలిసా బయటపెట్టింది. తన కుటుంబ సభ్యులపైనా ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇష్టపడి, హిందూ సంప్రదాయం ప్రకారం తాను ఫర్మాన్‌ను వివాహం చేసుకున్నానని, తనది లవ్ జీహాద్ కాదని స్పష్టం చేసింది. 
 
తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని మోనాలిసా పేర్కొంది. తనతో సినిమా తీయడానికి వచ్చిన సనోజ్ మిశ్రా అనేక సార్లు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు ఇష్టం లేకపోయినా తనను తాకడానికి ప్రయత్నించాడని మోనాలిసా తెలిపింది.
 
ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదని.. ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా తాను ఫర్మాన్‌ను పెళ్ళి చేసుకునే సరికీ తట్టుకోలేపోతున్నాడు. ఆయన పాల్పడిన అనైతిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు తన వద్ద వున్నాయని.. ఆయన సినిమాను పూర్తి చేశానని, తనతో పది కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నానని సనోజ్ చెప్తున్నారని.. కానీ కనీసం మూడు లక్షల విలువ కూడా చేయదని మోనాలిసా స్పష్టం చేసింది. 
 
తనను, తన భర్తను చంపుతామని కొందరు బెదరిస్తున్నారని, వారి నుండి తమకు రక్షణ కల్పించమని మోనాలిసా కేంద్ర ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
తర్వాతి కథనం
Charan: రామ్ చరణ్ క్షేమం - రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు- 27న గేమ్ గ్లింప్స్