రష్మీకి ఛాన్సులే ఛాన్సులు.. 'చారుశీల'గా అందాలు ఆరబోసేందుకు రెఢీ!
బుల్లితెరపై ఆడియన్స్‌ని అలరించిన యాంకర్ రష్మీ, వెండితెరపై కూడా అదే జోరును కొనసాగిస్తుంది. బుల్లి తెర యాంకర్‌గా పరిచయమై వచ్చి రాని తెలుగులో చిలక పలుకులు పలికే రష్మీ ఫేట్ సడన్‌గా మారిపోయింది. సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు దక్కించుకుంటూ బుల్లితెర యాంకర్‌గా కంటిన్యూ అవుతున్న హాట్ బ్యూటీ రష్మీకి ''గుంటూర్ టాకీస్'' చిత్రంలో హీరోయిన్ ఆఫర్ దక్కింది. ఈ సినిమాలో రష్మీ అందాల ప్రదర్శనకు హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయింది. ఆమె అందాలతో కుర్రకారుకి మత్తెక్కిచ్చింది. ''గుంటూరు టాకీస్'' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో అమ్మడి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.
రష్మీకి వరుసగా సినిమా ఛాన్సులు వచ్చి పడుతున్నాయి. ''గుంటూరు టాకీస్'' తర్వాత వి.శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రష్మీ లీడ్ రోల్ పోషించిన చిత్రం ''చారుశీల''. ఇటీవలే విడుదలైన టీజర్‌తో అందరిని ఆకట్టుకుంటూ ప్రస్తుతం యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్న సందర్భంలో.. చిత్ర థియేట్రికల్ ట్రైలర్ మే 6వ తేదీన సూర్య నటించిన "24" చిత్రంతో వెండితెరపై అందరిని అలరించనుంది. ఇటీవలే టీజర్‌ని ప్రత్యేకంగా చూసిన దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు ఇదో మంచి తెలుగు చిత్రం అవుతుందని కితాబునిచ్చారు. కెమెరామెన్‌గా ఎన్నో విజయాల్ని అందుకున్న వి.శ్రీనివాసరెడ్డి గారికి దర్శకుడిగా "చారుశీల" మంచి విజయాన్ని అందిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తూ, టీజర్ చూస్తుంటే చారుశీలగా నటించిన రష్మీ, రాజీవ్‌లు తమ నటనకి జీవం పోసినట్టుగా ఉంది అని తెలిపారు.

