శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మే 2023 (15:50 IST)

తమన్నా లవర్ త్వరలోనే శుభవార్త చెప్తాడా?

Tamannah Bhatia
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా లవర్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 
 
కొద్ది రోజుల క్రితం ఓ పార్టీలో తమన్నా ముద్దుపెట్టుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వార్తలను వీరిద్దరూ కొట్టిపారేశారు. ఆ తర్వాత మళ్లీ విజయ్ వర్మతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ సందర్భంలో, అబుదాబిలో జరిగిన IIFA అవార్డు వేడుకలో పాత్రికేయులు, నటుడు విజయ్ వర్మను శుభవార్త ఏదైనా ఉందా? తమన్నాతో పెళ్లి విషయమై ప్రశ్నించారు. త్వరలో మంచి సినిమా ఇచ్చే ప్రయత్నం చేస్తాను’ అని సమాధానమిచ్చి వెళ్లిపోయారు.