సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (10:36 IST)

మరో యువతితో భర్త సహజీవనం.. బిర్యానీ తిని తప్పు చేశాను...?

woman
తాడేపల్లిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. తన భర్త మరో యువతి సహజీవనం చేస్తున్నాడని.. వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం చేయాలి అంటు బైఠాయించింది. 
 
తన భర్త సునీల్ గత మూడు రోజుల నుంచి కనిపించటం లేదంటూ సుజాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సునీల్ ప్రకాష్ నగర్‌లో వాలంటీర్‌తో వివాహేతర సంబంధం వుందని.. ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు చెప్పింది. 
 
నెల క్రితం ఆ యువతి తనకు బిర్యానీ పంపిందని.. అది తిన్న తర్వాత నుంచి తాను అనారోగ్యం పాలయ్యానని వెల్లడించింది. అత్తింటి వారు మరో యువతితో కలసి తన భర్తను ఏమి చేశారో అంటు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.