గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (11:38 IST)

నటి డింపుల్ హయతి ఇంట్లోకి యువతీ యువకులు.. కుక్కను జడుసుకుని..?

Dimple
సినీ నటి డింపుల్ హయతి, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేల మధ్య వివాదం నెలకొంది. జంతువులను హింసిస్తున్నందుకు డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని డింపుల్ లాయర్ అన్నారు. 
 
ప్రస్తుత పరిణామాలతో డింపుల్ మానసిక ఒత్తిడికి గురైందని, బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతోందని చెప్పారు. డింపుల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ తనకు అందిందని, కారు కవర్ తీసినట్టు ఎఫ్ఐఆర్‌లో ఉందని, పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 
 
మరోవైపు డింపుల్ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ ఎన్‌క్లేవ్‌లో డింపుల్ ఆమె సహచరుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి వుంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ వివాదంలో డింపుల్, డేవిడ్‌లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. 
 
గురువారం ఉదయం అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన యువతి, యువకుడు సీ2లో ఉండే డింపుల్ నివాసంలోకి వెళ్లారు. పనిమనిషి ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేసింది. ఇంతలో ఇంట్లోని కుక్క వారి వద్దకు వెళ్లడంతో వారు భయపడి లిఫ్టులోకి వెళ్లారు. 
 
ఈ విషయం తెలుసుకున్న డింపుల్ డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు యువతీయువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
వారిని విచారించగా, రాజమండ్రి నుంచి వచ్చామని., డింపుల్ అభిమానులమని చెప్పారు. విషయం తెలిసి హయాతి వారిని విడిచిపెట్టమని చెప్పడంతో వారిని విడిపించారు.