సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మే 2023 (11:21 IST)

ఐటం గర్ల్ డింపుల్ హయతిపై పోలీసులు కేసు.. ఏం జరిగింది?

Dimple
Dimple
ఐటం గర్ల్ డింపుల్ హయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును ఆమె తన కారుతో ఢీకొట్టింది. 
 
ఈ ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఎస్కేఆర్ అపార్ట్ మెంట్స్‌లో చోటుచేసుకుంది. ఆ తర్వాత రచ్చ చేస్తూ ఐపీఎస్ అధికారి ప్రభుత్వ వాహనాన్ని కాలుతో తన్నింది. 
 
రాహుల్ హెగ్డే ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీగా ఉంటున్నారు. ఈ ఘటనపై రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై పోలీసులు సెక్షన్ 341, 279, 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.