సంబంధిత వార్తలు
- ఆచార్య అప్‌డేట్ః చరణ్‌తో సాంగ్, సోనూసూద్‌తో యాక్షన్
- చిరంజీవి విడుదలచేసిన `మందులోడా మాస్ కా బాస్` సాంగ్ కు స్పందన
- శ్రీదేవి సోడా సెంటర్ లో మందులోడా మాయలోడా.. ఫోక్‌సాంగ్ వచ్చేసింది
- పర్యాటక మంత్రిత్వ శాఖ : నాడు చిరంజీవి - నేడు కిషన్ రెడ్డి
- రామ్‌చరణ్, ఉపాసన లంచ్ డేట్‌కు ఎందుకు వెళ్ళారో తెలుసా!
తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు... సిద్ధ న్యూ లుక్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చెర్రీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు ఆఖరి షెడ్యూల్‌లో అడుగుపెట్టింది.
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా చిత్ర షూటింగ్‌ను నిలిపివేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 'ఆచార్య' షూటింగ్ మళ్లీ ప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది.
"ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి" అంటూ ట్వీట్ చేసింది. అందరినీ అలరించేలా త్వరలోనే 'ఆచార్య' నుంచి అప్ డేట్లు రానున్నాయని తెలిపింది. కొణిదెల ప్రొ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
