1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress Poonam Kaur performs poojas at Vemulawada temple

Poonam Kaur : భీమేశ్వర ఆలయంలో పూనమ్ కౌర్ పూజలు

Poonam Kaur
Poonam Kaur
సినీ నటి పూనమ్ కౌర్ సోమవారం వేములవాడను సందర్శించి, భీమేశ్వర ఆలయంలో భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు, కోడె మొక్కును సమర్పించారు. అనంతరం, ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ, దైవాశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. 
 
దేశంలో చోటుచేసుకుంటున్న వివిధ రకాల సంఘటనల నేపథ్యంలో, ప్రజలలో భక్తిభావం పెంపొందాలని కూడా తాను ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తయ్యాక, తాను వేములవాడను తిరిగి సందర్శిస్తానని ఆమె చెప్పారు. అక్షయ తృతీయ సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒకప్పటి నటి. స్వామివారి కరుణ కటాక్షాలు టెక్స్‌టైల్ రంగంతోపాటు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ చాలా సింపుల్‌గా టెంపుల్‌కి రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
About Writer
సెల్వి