1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Poonam Kaur Controversial Comments on Posani Krishna

తొక్కేయడానికి కొందరు రూ.15 కోట్లు ఖర్చు చేశారు : పూనమ్ కౌర్

poonam kaur
తనను తొక్కేయడానికి కొందరు రూ.15 కోట్లు ఖర్చు చేశారంటూ సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, తన వ్యక్తిగత జీవితం, కేరీర్ ఎలా నాశనమయ్యోయో వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి ప్రెస్మీట్ గురించి మాట్లాడుతూ, అది తన జీవితాన్ని మలుపు తిప్పిందని, అంతా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
నేను ఒక పెద్ద మనిషి దగ్గర డబ్బులు తీసుకుని రాజీపడ్డానని తప్పుడు ప్రచారం చేశారు. అది నా తల్లిని ఎంత బాధపెట్టిందంటే, ఆమె గురుద్వారాకు వెళితే కూతురిని డబ్బు కోసం అమ్మేశావా అని అడిగారు. మా బంధువులు కూడా నన్ను నమ్మలేదు. నన్ను తొక్కేయడానికి రూ.15 కోట్లు ఖర్చు చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
ముఖ్యంగా పోసాని కృష్ణమురళి వద్ద తన పెళ్లి ఆగిపోయిందని చెప్పారు. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక స్నేహితుడు ముందుకు వచ్చిన సమయంలో పోసాని ప్రెస్మీట్ పెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. దాంతో అతను దూరమయ్యాడు. ఆ ఘటన తర్వాత మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఆ ఒక్క ప్రెస్మీట్ నా ఆకరోగ్యం , సంతోషం, కెరీర్, అన్నింటినీ నాశనం చేసింది అని నవనీత్ కౌర్ చెపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 
తర్వాతి కథనం
Sushmita Konidela: చిరంజీవి శ్రస్త చికిత్సపై సుష్మిత కొణిదెల వివరణ