1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Agnyaathavaasi GaaliVaaluga second single release date

12న #Agnyaathavaasi 'గాలి వాలుగ‌...' పాట రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, సోషల్ మీడియా వేదికగా ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్న

Agnyaathavaasi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, సోషల్ మీడియా వేదికగా ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు.
 
ఇప్పటికే మొదటి పాటతో పాటు.. చిత్రం టైటిల్‌ను రిలీజ్ చేయగా, ఈనెల 12వ తేదీన మరో  పాటను రిలీజ్ చేయనున్నారు. 'గాలి వాలుగ‌...' అంటూ సాగ‌నున్న ఈ పాట‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను వారు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.
 
ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్‌గా నిల‌బడిన స్టిల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రంలో మొద‌టి పాట 'బ‌య‌టికొచ్చి చూస్తే....' అభిమానులను ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌లు హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సప్తగిరి ఇక ఎక్స్‌ప్రెస్సే... 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' రివ్యూ రిపోర్ట్