మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2017 (21:16 IST)

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, ఓవర్సీస్‌లో బాహుబలిని వణికిస్తున్నాడా? ఇదీ లెక్క

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న అజ్ఞాతవాసి రికార్డులు మొదలుపెట్టింది. ఓవర్సీస్‌లో బాహుబలి రికార్డును బద్దలుకొడుతూ 209 సినిమార్క్ లొకేషన్లలో విడుదల కాబోతోంది. ఒక ఇండియన్ ఫిలిమ్ ఇంత పెద్దస్థాయిలో విడ

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న అజ్ఞాతవాసి రికార్డులు మొదలుపెట్టింది. ఓవర్సీస్‌లో బాహుబలి రికార్డును బద్దలుకొడుతూ 209 సినిమార్క్ లొకేషన్లలో విడుదల కాబోతోంది. ఒక ఇండియన్ ఫిలిమ్ ఇంత పెద్దస్థాయిలో విడుదల కావడం ఇదే తొలిసారి. 
 
అంతకుముందు బాహుబలి 126 లొకేషన్లలో విడుదలై రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం 74 లొకేషన్లలో విడుదలై మూడోస్థానం, రజినీకాంత్ కబాలి చిత్రం 73 చోట్ల విడుదలై 4వ స్థానం, అమీర్ ఖాన్ దంగల్ చిత్రం 69 లొకేషన్లలో విడుదలై 5వ స్థానంలో వున్నాయి.