మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 2 డిశెంబరు 2017 (14:55 IST)

కోహ్లి మరో రికార్డు... 105 ఇన్నింగ్సులో 5000 పరుగులు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఫీట్ అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 5000 పరుగులు అందుకున్న 11వ ఇండియన్ బ్యాట్సమన్‌గా నిలిచాడు. ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి 28 పరుగుల వద్ద ఈ రికార్డును అందుకున్నాడు. 105 ఇన్నింగ్సులో కోహ్లి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఫీట్ అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 5000 పరుగులు అందుకున్న 11వ ఇండియన్ బ్యాట్సమన్‌గా నిలిచాడు. ఢిల్లీలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లి 28 పరుగుల వద్ద ఈ రికార్డును అందుకున్నాడు. 105 ఇన్నింగ్సులో కోహ్లి ఈ ఫీట్ ను అందుకున్నాడు. 
 
కాగా అత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న నాల్గవ బ్యాట్సమన్ కోహ్లి కావడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. కోహ్లి 100 పరుగులు, మురళి విజయ్ 114 పరుగులతో క్రీజులో వున్నారు.