మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2017 (12:50 IST)

మీరు మీరుగా వుండండి: మానుషికి బదులిచ్చిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మారుమోగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో విజయాలు, రికార్డులు సొంతం చేసుకుంటున్న కోహ్లీని.. ఓ అవార్డ్ ఫంక్షన్‌లో సుదీర్ఘ విరామం తరువాత అందాల ప్రపంచంలో భారతీయ జెండాను ఎ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మారుమోగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో విజయాలు, రికార్డులు సొంతం చేసుకుంటున్న కోహ్లీని.. ఓ అవార్డ్ ఫంక్షన్‌లో సుదీర్ఘ విరామం తరువాత అందాల ప్రపంచంలో భారతీయ జెండాను ఎగురవేసిన మానుషి చిల్లర్ ఓ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు కోహ్లీ సరిగ్గా సమాధానం చెప్పాడు 
 
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అయిన మీరు... పిల్లలకు, ప్రత్యేకించి క్రికెట్ ప్రపంచంలో ఉన్నవారికి ఎలాంటి సందేశాన్నిస్తారని ప్రశ్నించింది. అందుకు కోహ్లీ సరైన సమాధానం ఇచ్చారు. మైదానంలో ఆడే వారు యధార్థంగా, మనస్ఫూర్తిగా ఆడాలి. 
 
లేకుంటే ప్రజలు మిమ్మల్ని నటిస్తున్నట్లు అనుమానిస్తారు. ఒక్కసారి వాళ్లకు అలాంటి సందేహం వస్తే వారెప్పటికీ మిమ్మల్ని కనెక్ట్ కాలేరు. తాను కూడా తానెలా ఆడగలనో అలాగే ఆడుతున్నానని.. అందుకే మీరు మీరుగా వుండాలని సమాధానం ఇచ్చాడు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండంటూ కోహ్లీ సందేశాన్నిచ్చాడు. అనుభవాలు అన్నింటినీ నేర్పిస్తాయని.. ఎక్కడ నుంచి వచ్చాం. ఎందుకొచ్చామని అర్థం చేసుకుని.. మన పని మనం చేసుకుపోతే లక్ష్యాలను చేధించవచ్చునని కోహ్లీ వ్యాఖ్యానించాడు.