పవన్ కల్యాణ్ 26వ సినిమా.. స్క్రిప్ట్ వినేందుకు పవర్ స్టార్ రెడీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. సినిమాను జనవరి 10 తేదీన విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ కూడా కన్ఫామ్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. సినిమాను జనవరి 10 తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పవన్ తన కెరీర్‌లో 26వ సినిమాపై దృష్టి పెట్టారు. త్రివిక్రమ్‌తో 25వ సినిమా చేస్తూనే.. మైత్రీ మూవీస్ పతాకంపై కొత్త సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయిగా రాజకీయాల్లో వచ్చేందుకు పవన్ రెడీగా వున్నారనే వార్తలకు చెక్ పెట్టే దిశగా పవర్ స్టార్ తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ వింటున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తన టీమ్‌తో కలిసి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని.. మైత్రీ మూవీస్ పతాకంపై సినిమా చేస్తామని పవన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. ఈ స్కిప్ట్ పవన్ వింటారని సమాచారం.