శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (12:15 IST)

నాన్నను ఒప్పించలేక పోయా... ప్రేమకు మతం లేదు.. యాంకర్

తమిళ టీవీ సన్ నెట్‌వర్క్‌కు చెందిన ఓ యాంకర్ ప్రేమ వివాహం చేసుకుంది. మతాంతరం వివాహం కావడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఆ యాంకర్ పేరు మణిమేఘలై.

తమిళ టీవీ సన్ నెట్‌వర్క్‌కు చెందిన ఓ యాంకర్ ప్రేమ వివాహం చేసుకుంది. మతాంతరం వివాహం కావడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఆ యాంకర్ పేరు మణిమేఘలై. తన వివాహం తర్వాత ఆమె ఓ ట్వీట్ చేసింది. "ప్రేమకు మతం లేదు" అని పేర్కొంది. 
 
అంతేకాకుండా, "హుస్సేన్, నేను ఇవాళ పెళ్లి చేసుకున్నాం. సడెన్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మా నాన్నను ఒప్పించడంలో ఫెయిల్ అయ్యాను. దీంతో ఈ డెసిషన్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఏదో ఒకరోజు ఆయన నన్ను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రేమకు మతం లేదు. ఐ లవ్ యు హుస్సేన్. శ్రీ రామ జయం.. అల్లా" అంటూ మణి ట్వీట్ చేసింది.
 
కాగా, హుస్సేన్‌, మణిమేఘలైల మతాలు వేర్వేరు కావడంతో యాంకర్ తండ్రి పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి బుధవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.