ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (15:29 IST)

భార్యాభర్తల బంధం... ఇవి తెలుసుకుంటే జీవితం సంతోషమయం

భారతీయ హిందు వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే గొప్ప పేరుప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ వివాహ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. కానీ, కొందరు ఉన్మాదులు భార్యాభర్తల అనుబంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

భారతీయ హిందూ వివాహ వ్యవస్థకు ప్రపంచంలోనే గొప్ప పేరుప్రఖ్యాతలు ఉన్నాయి.

ఈ వివాహ వ్యవస్థను ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు.

కానీ, కొందరు ఉన్మాదులు భార్యాభర్తల అనుబంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

ఫలితంగా అనేక విపరీతాలు జరుగుతున్నాయి.

భార్యాభర్తల అనుబంధం గురించి సోషల్ మీడియాలో ఓ కవిత ట్రెండ్ అవుతోంది. 
 
బాత్రూంలో నుండి "ఏమండీ" అని పిలిచిందంటే బొద్దింకని కొట్టాలని అర్థం.
రెస్టారెంట్‌లో తిన్నాక "ఏమండీ" అని పిలిచిందంటే బిల్లు కట్టమని అర్థం.
కళ్యాణమండపంలో "ఏమండీ" అని పిలిచిందంటే తెలిసినవారొచ్చారని అర్థం.
బట్టల షాపులో "ఏమండీ" అని పిలిచిందంటే వెతుకుతున్న చీర లభించిందని అర్థం.
 
బండిలో వెళ్ళేటపుడు "ఏమండీ" అని పిలిచిందంటే పూలు కొనాలని అర్థం.
హాస్పిటల్‌కి వెళ్ళినపుడు "ఏమండీ " అని పిలిచిందంటే డాక్టర్‌తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్థం.
వాకిట్లోకి వచ్చి బయట చూసి "ఏమండీ" అని పిలిచిందంటే తెలియనివారెవరో వచ్చారని అర్థం.
బీరువా ముందు నిలబడి "ఏమండీ" అని పిలిచిందంటే డబ్బు కావాలని అర్థం.
 
డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి "ఏమండీ" అని పిలిచిందంటే భోజనానికి రమ్మని అర్థం.
భోజనం చేసేటపుడు "ఏమండీ" అని పిలిచిందంటే భోజనం టేస్ట్ గురించి అడిగిందని అర్థం.
అద్ధం ముందు నిలబడి "ఏమండీ" అని పిలిచిందంటే ఈ చీరలో తనెలా ఉందో చెప్పమని అర్థం.
నడిచేటపుడు "ఏమండి" అని పిలిచిందంటే వేలు పట్టుకుని నడవమని అర్థం.
నీవు చివరి శ్వాస తీసుకునేటపుడు "ఏమండీ" అని పిలిచిందంటే నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అని అర్థం.
 
అలా అనునిత్యం ఏమండీ అంటూ చంపేస్తుందని అపార్థం చేసుకోవడం కాదు అర్థం చేసుకుని మసులుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే జీవితం సంతోషమయమవుతుంది. ప్రపంచం మొత్తం గౌరవిస్తున్న హిందూ వివాహ వ్యవస్థ... ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మనదే... ఒకే వ్యక్తితో ప్రతిరోజూ ప్రేమలో పడటమే పెళ్ళంటే.