శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (10:40 IST)

అలియా భట్‌కు కరోనా నెగటివ్.. ఇక షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్‌గా అలియా భట్ బాయ్ ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది. అలానే అలియా భట్ నటిస్తున్న గంగూభాయ్ కంతియావాడి చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వారికి సన్నిహితంగా ఉన్న అలియా వెంటనే సెల్వ్ క్వారంటైన్‌లోకి వెళ్లింది.
 
రణ్‌బీర్ కపూర్, సంజయ్ లీలా భన్సాలీలకు కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే అలియా భట్ కూడా కరోనా పరీక్షలు చేయించుకుంది. గురువారం సాయంత్రం రిపోర్ట్ రాగా, తనకు నెగెటివ్ అని తేలినట్టు అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. తపచూపిన శ్రద్ధ, ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అలియా తన పోస్ట్‌లో రాసింది. నిర్దారణ పరీక్షలలో నెగెటివ్ అని తేలడంతో ఇక ఈ రోజు నుండి షూటింగ్స్‌లో పాల్గొననుంది అలియా భట్‌.