పుట్టిన రోజున సహాయ కార్యక్రమాలు చేస్తున్న `బజార్ రౌడీ`
Sampoorneshbabu
సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. 1000 సినిమాలకు పైగా ఎడిటింగ్ చేసిన సీనియర్ ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ సినిమాకి పనిచేశారు. SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే ఈ బజార్ రౌడీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ కష్టం వచ్చినా తనవంతుగా సహయ కార్యక్రమాల ద్వారా సహయపడే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు
(మే 9న ) సందర్బంగా అభిమానులు సహయ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మా బజార్ రౌడి యూనిట్ అంతా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, సాయాజి షిండే, 30 ఇయర్స్ పృథ్వి, కత్తి మహేష్ తదితరులు..
సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: ఏ విజయ్ కుమార్.
