సంబంధిత వార్తలు
బిగ్‌బాస్ తెలుగు 8: రొమాంటిక్ టచ్ మొదలు.. ఎవరి మధ్య?
Nagarjuna
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ల్లో నెగ్గి తొలుత నిఖిల్ తర్వాత నైనికలు చీఫ్‌లుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మూడో చీఫ్‌ను సెలెక్ట్ చేసే బాధ్యతను నిఖిల్ - నైనికలకే అప్పగించారు బిగ్‌బాస్. దీంతో వారిద్దరూ కలిసి డిష్కస్ చేసుకుని యాష్మీ గౌడను థర్డ్ చీఫ్‌గా ప్రతిపాదించారు.
ఇక నామినేషన్స్ డే నాడు ఇంట్లో గొడవలు మామూలే . అందుకు తగినట్లుగా మంగళవారం హౌస్ అరుపులు, కేకలతో మోతేక్కిపోయింది. నిఖిల్, నైనిక, యాష్మీలు చీఫ్‌లు కావడంతో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు.
ఇకపోతే బిగ్ బాస్ నుంచి పరమేశ్వర్ హిర్వాలే తప్పుకున్నారని టాక్. టాలీవుడ్‌లో నటుడిగా, డైరెక్టర్‌గా సుపరిచితుడు అయిన అతడు.. చివరి నిమిషంలో షో నుంచి తప్పుకున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది.
పరమేశ్వర్ హిర్వాలేను బిగ్ బాస్ నిర్వహకులు ఫైనల్ చేసిన సంగతి వాస్తవమే. అంతేకాదు, అతడు షోకు రెండు రోజుల ముందు కూడా టచ్‌లో ఉన్నాడు. అయితే, ఒక్కసారిగా అతడు అనారోగ్యానికి గురయ్యాడు. అలాగే, ఆస్పత్రిలో సైతం చేరాల్సి వచ్చింది. అప్పుడు వైద్యులు అతడికి కొద్ది రోజులు రెస్ట్ సూచించారట. ఈ కారణంగానే పరమేశ్వర్ షోలోకి ఎంట్రీ ఇవ్వలేదు.
