బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (11:37 IST)

బిగ్ బాస్ తెలుగు హౌస్‌లోకి వెళ్లిన జంటలు వీరే...

bogg boss
విశేష ప్రేక్షకాదరణ చూరగొన్న తెలుగు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున మరోమారు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. అయితే, ఒక్కొక్కరిని కాకుండా... ఈ 14 మందిని ఏడు జంటలుగా చేసి బిగ్ బాస్ ఇంట్లోకి పంపడం ఈ సీజన్ స్పెషాలిటీ. గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో అనేక ట్విస్టులు, లిమిట్ లెస్ ఫన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కంటెస్టెంట్లలో టీవీ నటులు, యూట్యూబర్లు ఉన్నారు.
 
బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన జంటలను పరిశీలిస్తే, 1. యష్మి గౌడ - నిఖిల్  2. అభయ్ నవీన్ - ప్రేరణ 3. ఆదిత్య ఓం- ఆకుల సోనియా 4. బెజవాడ బేబక్క-శేఖర్ బాషా 5. కిరాక్ సీత- నాగమణికంఠ 6. పృథ్వీరాజ్- విష్ణుప్రియ 7. నైనిక-నబీల్ అఫ్రిది. వీరిలో యష్మి, నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్ టీవీ నటులు కాగా... ఆదిత్య ఓం, అభయ్ నవీన్, సోనియా సినీ నటులు. శేఖర్ బాషా రేడియో జాకీ కాగా... బెజవాడ బేబక్క, నాగమణికంఠ, నబీల్ అఫ్రిది, కిర్రాక్ సీత యూట్యూబర్లు. విష్ణుప్రియ టీవీ యాంకర్ కాగా... నైనిక డ్యాన్సర్.