సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2024 (13:56 IST)

ఊటీలో ఓ ఇంట్లోకి చిరుత, ఎలుగుబంటి ఒకదాని వెంట ఒకటి దూరాయి(Video)

leopard
కర్టెసి-ట్విట్టర్
అడవులు తగ్గిపోవడంతో వన్యమృగాలు ఇప్పుడు నగరాలు, పట్టణాలు, పల్లెల వైపు నడుచుకుంటూ ఆహారం కోసం వచ్చేస్తున్నాయి. ఆమధ్య చెన్నైలోని అడయార్ ప్రధాన రహదారిపై ఓ సింహం రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్లడాన్ని చాలామంది చూసారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో ఇలాంటిదే జరిగింది.
 
రాత్రివేళ ఊటీకి సమీపంలోని యెల్లనల్లి కైకాట్టి గ్రామంలో ఓ ఇంటిలోకి చిరుత వెళ్లడాన్ని అక్కడి సిసి కెమేరాల్లో రికార్డు అయ్యింది. కేవలం చిరుత ఒక్కటే కాదు.. కొన్ని నిమిషాల్లో ఎలుగుబంటి కూడా అదే మార్గం ద్వారా అటువైపే వెళ్లింది. ఇలా రెండు జంతువులు ఒకదాని తర్వాత ఒకటి ఒకే మార్గంలో వెళ్లడంపై నెటిజన్లు జోకులేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మీరూ చూడండి.