గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 మార్చి 2024 (20:33 IST)

అతడి ప్రాణాన్ని రక్షించిన హెల్మెట్-శిరస్త్రాణము-Video

helmet that saved his life in road accident
హెల్మెట్-శిరస్త్రాణము. ద్విచక్రవాహనం నడిపేటపుడు తప్పనిసరిగా ధరించాల్సిన రక్షణ కవచం ఇది. ఐతే చాలామంది దాన్ని పట్టించుకోరు. కొంతమంది హెల్మెట్ వున్నా... దాన్ని తన వాహనం ఆయిల్ ట్యాంకు పైనో... లేదంటే వెనక సీటుకు బిగించి వెళుతుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను ఎలా రక్షిస్తుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
 
ఈ వీడియోలో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ద్విచక్రవాహనదారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే... అతడికి నూకలు అంతటితో చెల్లిపోయేవి. అందుకనే ద్విచక్రవాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపకూడదు. ద్విచక్రవాహనదారులకు ఈ విషయంపై పోలీసువారు ఎంతగా చెప్పినా చాలామంది వాటిని పట్టించుకోరు.
 
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పట్టింపులేని ధోరణి మరీ ఎక్కువగా కనబడుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత చింతించి ప్రయోజనం లేదు, అది జరగక మునుపే జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్ర వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.