1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Choreographer Anee Master tests Covid Positive

ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్‌కు కరోనా పాజిటివ్

Choreographer Anee Master
ప్రముఖ కొరియోగ్రాఫర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్, పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా ఉన్న అనీ మాస్టర్‌కు కరనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈమెకు గత యేడాది కూడా కరోనా వైరస్ సోకింది. 
 
"గత యేడాది కూడా నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కరోనా వచ్చిన 24 రోజుల తర్వాత 2021 జనవరి 23వ తేదీన తగ్గిపోయింది మళ్లీ ఇపుడు 2022 జనవరి 23వ తేదీన కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ కరోనా నా లాగా టైమ్ మెయింటైన్ చేస్తుంది. క్వారంటైన చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది" అని ట్వీట్ చేశారు. 
 
చిరంజీవిని కూడా... 
మెగాస్టార్ చిరంజీవికి కరోనా వైరస్ మరోమారు సోకింది. మంగళవారం నుంచి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
కాగా, ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, త్వరలోనే కోలుకుని మిమ్మలను కలుస్తానని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 
 
గతంలో కూడా చిరంజీవి కరోనా వైరస్ బారినపడ్డారు. అపుడు కూడా హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి ఇంటి పనిమనిషికి తొలుత వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి ఇంట్లోని పలువురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మెగా బ్రదర్ నాగబాబు, హీరో పవన్ కళ్యాణ్ కూడా ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కొండా దంపతుల రాజకీయ ప్రయాణంతో తెరకెక్కిన "కొండా"