1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Sharad Pawar Tested Covid Positive

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కోవిడ్ పాజిటివ్

Sharad Pawar
కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత, మరాఠా యోధుడు శరద్ పవార్ కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
అయితే, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, తనను కాంటాక్ట్ అయిన వారు విధిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 
 
ఇదిలావుండగా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు కోవిడ్ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
హిమ‌ప్రియ‌కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డు