మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (18:29 IST)

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్

కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించారు. అవసరమైన ప్రోటోకాల్స్ పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. అదేసమయంలో ఇటీవలి కాలంలో తనను కలిసివారంతా తక్షణం కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 
 
ఇదిలావుంటే, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు, సెలెబ్రిటీలు, వీఐపీలు, రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికేచాలా మంది సినీతారలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఈ వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 
 
బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు, అంతకుముందు రోజు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు కూడా ఈ వైరస్ బారినపడ్డారు.