శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (15:27 IST)

భారత మాజీ టర్బోనేటర్‌కు కరోనా పాజిటివ్

ఇటీవల బీసీసీఐ చీఫ్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కరోనా వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఇపుడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సినీ నటుడు హర్భజన్ సింగ్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్టు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
"కరోనా పాజిటివివ్‌గా తేలింది. అయితే, స్వల్ప లక్షణాలే ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాను. నాతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సురక్షితంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేారు.