సినీ సెలెబ్రిటీలను వెంటాడుతున్న కరోనా వైరస్
కరోనా వైరస్ సినీ సెలెబ్రిటీలను వెంటాడుతోంది. ఇప్పటికే అనేక మంది సినీ స్టార్స్ ఈ వైరస్ చేతుల్లో చిక్కి కోలుకున్నారు. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు స్టార్ హీరోలకు ఈ వైరస్ సోకింది. వీరిద్దరూ మలయాళ హీరోలే. వారిలో ఒకరు దుల్కర్ సల్మాన్ కాగా, మరొకరు సురేష్ గోపి. ఈ విషాయన్ని వారిద్దరూ వేర్వేరుగా తమతమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.
ఇటీవలే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు దుల్కర్‌కు కరోనా వైరస్ సోకింది. అలాగే, సురేష్ గోపి కూడా వైరస్ సోకినట్టు ప్రకటించారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయినప్పటికీ నాకు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుంత హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.