సంబంధిత వార్తలు
- 'ఇదే నా ఆఖరి టిక్‌టాక్ వీడియో' అంటూ విషం తాగి.. భర్తకు పంపింది..
- స్టార్ యాక్టర్ల మధ్య స్టైలిష్ స్టార్ నిలబడతాడా..! త్రివిక్రమ్ స్కెచ్ ఏంటి..?
- చెల్లెమ్మ రోజాకు జగనన్న కీలక పదవి.. (Video)
- చిరంజీవి చిన్నల్లుడుకి సైబర్ వేధింపులు..
- లాకప్‌లో వేసి బట్టూడదీసి, నోటిలో మూత్రం పోసారు.. విలేకరికి చేదు అనుభవం (వీడియో)
దాసరి కుమారుడి అదృశ్యం.. ఏమయ్యాడు.. ఎక్కడున్నాడు?
దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు తీర్చారు కానీ ఇంట్లో సమస్యలు మాత్రం తీర్చలేకపోయారు. మొన్నటికి మొన్న దాసరి పెద్ద కోడలు బయటికి వచ్చి తన ఆస్తి కొట్టేసారంటూ మోహన్ బాబుపై ఆరోపణలు చేసింది. తాజాగా దాసరి కుమారుడు ప్రభు కనిపించడం లేదని ఫిర్యాదు నమోదైంది. నాలుగు రోజుల పాటు ఆయన కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది.
జూన్ 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఇప్పటి వరకు మళ్లీ తిరిగి రాలేదు. దాంతో ప్రభు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేస్ ఫిర్యాదు చేశారు. పదేళ్ల కింద కూడా ఒకసారి ప్రభు ఇలాగే మిస్ అయిపోయాడు. అప్పుడు కూడా 2008లో కొన్ని రోజులు కనిపించకుండా పోయి.. తర్వాత వచ్చి తన భార్య సుశీలే కిడ్నాప్ చేయించిందని సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఇదే తరహాలో ప్రభు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
