శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 12 జూన్ 2019 (15:52 IST)

చిరంజీవి చిన్నల్లుడుకి సైబర్ వేధింపులు..

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్‌ని కొంతమంది పోకిరీలు ఇన్‌స్టాగ్రామ్‌లో వేధిస్తున్నారు. తనను పదిమంది పోకిరీలు వేధిస్తున్నారనీ, తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.
 
కళ్యాణ్ దేవ్ ఫిర్యాదుపై విచారణ పోలీసులు విచారణ చేపట్టారు. హీరో కల్యాణ్‌ను వేధిస్తున్న పదిమంది ఎవరో గుర్తించామనీ, ఆ పది మంది అకౌంట్ల డీటెయిల్స్ కోసం ఇన్‌స్టాగ్రాంకు లేఖ రాశామన్నారు. అక్కడి నుంచి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ రఘు వీర్ వెల్లడించారు.