బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (10:47 IST)

మోడీ కేబినెట్‌లో ఎంత మంది కోటీశ్వరులు.. వారి ఆస్తి ఎంత?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 24 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేయగా, మరో 9 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. 
 
వీరిలో 51 మంది మంత్రులు కోటీశ్వరులుగా ఉండగా, వీరిలో ప్రధాని నరేంద్ర మోడీ 46వ కోటీశ్వరుడుగా ఉన్నారు. ఈ 51 మంది కోటీశ్వరుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా నియమితులైన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ రూ.217 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రైల్వే మంత్రిగా ఉన్న పియూష్ గోయల్ రూ.95 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, గణాంకాలు, కార్యక్రమాల అమలు, ప్రణాళికా శాఖ(స్వతంత్ర హోదా) సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ రూ.42 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. 
 
ఇకపోతే, బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (రూ.40 కోట్లు), ప్రధాని నరేంద్ర మోడీ రూ.2 కోట్లతో 46వ స్థానంలో ఉన్నారు. మరోవైపు, ఐదుగురు మంత్రులు తమ ఆస్తి కోటిలోపు ఉంది. కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ఆస్తి కేవలం రూ.13 లక్షలు మాత్రమే. 
 
ఈ మంత్రుల్లో 22మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇక విద్యార్హతల విషయానికి వస్తే 8 మంది మంత్రులు టెన్త్ క్లాస్, 12వ తరగతి పాస్ అయితే, 47 మంది మంత్రులు విద్యార్హత డిగ్రీగా ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది.