మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 17 అక్టోబరు 2018 (21:15 IST)

పవన్ కళ్యాణ్‌‌ను హైపర్ ఆది ఏమన్నాడో తెలిస్తే షాకవుతారు...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు కమెడియన్ హైపర్ ఆది. స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ నిరంతరం ఏవిధంగా అయితే పోరాటం చేశారో పవన్ కళ్యాణ్‌ కూడా అదేవిధంగా పోరాటం చేస్తున్నారని, పవన్ మరో గాంధీ అన్నారు  హైపర్ ఆది. ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన అని, ప్రజల మనిషి పవన్ కళ్యాణ్‌ అన్నారాయన. 
 
ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకే పవన్ కళ్యాణ్‌ రంగంలోకి దిగారని చెప్పారు. జనంలో పవన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, పవన్‌కు వస్తున్న ప్రజాదరణను రాజకీయ పార్టీలు ఓర్వలేక విమర్సలు చేస్తున్నాయని, త్వరలోనే పవన్ కళ్యాణ్‌ సిఎం అవుతారని జోస్యం చెప్పారు హైపర్ ఆది.