1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Juicy update on Balayya's Akhanda?

అఖండ్ అప్డేట్ - బాలయ్య ఎంట్రీ ఎపిసోడ్‌ అదుర్స్

Balayya
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు అఖండ. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. 
 
ఇటీవలే విడుదలైన టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్‌ను రాబట్టింది. ఇంటర్వెల్ బ్యాంగ్‌‌లో అఘోరాగా బాలకృష్ణ ఎంట్రీ ప్రేక్షకులను సరికొత్త అనుభూతినిస్తుందని, అఖండ రషెస్ చూస్తే అర్థమవుతుంది.
 
ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఈ బ్రేక్ పాయింట్ సాలిడ్‌గా ఉంటుందట. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీ అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య ఎంట్రీ ఎపిసోడ్‌ను సినిమాకే హైలెట్‌గా నిలిచేలా డిజైన్ చేశాడట బోయపాటి. 
 
ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయమట. అఖండ చిత్రంలో శ్రీకాంత్‌, పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
టెంప్ట్ చేస్తూ ఫోటో వీడియో వదిలిన శ్రీ‌రెడ్డి, అమ్మ నా బత్తాయో అంటున్న ఫ్యాన్స్