గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: మంగళవారం, 11 మే 2021 (16:49 IST)

'అఖండ' కోసం బాబాయ్ బాలయ్యని ఇబ్బంది పెట్టిన అబ్బాయ్

నటసింహం బాలక్రిష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్సకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట.
 
ఇటీవల విడుదలైన టీజర్ దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అఖండ లేటెస్ట్ టీజర్ బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా అఖండ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో మరో నందమూరి వారసుడు నటించనున్నాడట.
 
అఖండ సినిమాలో ఒక పోలీసు ఆఫీసర్ పాత్ర వున్నదట. ఈ పాత్రలో నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. సుమారు 20 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుందట. వీరిద్దరు ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించారు.
 
అయితే అఖండ సినిమాలో తనకు అవకాశమివ్వాలని కళ్యాణ్ రామ్ బాలక్రిష్ణను ప్రాధేయపడ్డారట. ఎలాగైనా మీ సినిమాలో అవకాశమివ్వాలని కోరడంతో బాలక్రిష్ణ ఒప్పుకున్నారట. దీంతో బాబాయ్ సినిమాలో అబ్బాయి నటిస్తుండడం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.