సంబంధిత వార్తలు
- సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు - ఆరుగురికి రిమాండ్
- నా భార్యతో ఎవరైనా శృంగారం చేయొచ్చు, కానీ వీడియోలు తీస్తా: సైకో భర్త అరెస్ట్
- తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం... 37 నేతలకు లేఖలు
- నిర్మలా సీతారామన్ బడ్జెట్: సోషల్ మీడియాలో పేలిపోతున్న మీమ్స్
- ఇండియన్ ఆర్మీకి భూమి విరాళంగా ఇవ్వలేదు : హీరో సుమన్
మీమ్ స్టార్ గద్వాల్ బిడ్డ కన్నుమూత.. నువ్వెనివో నాకు తెల్వదు.. అంటూ?
Mallikarjun
అతడు ఆస్తమాతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని సౌత్ ఇండియన్ థగ్స్ అనే పేజీ నుండి మెసేజ్ వైరల్ అయ్యింది. మల్లికార్జున్ స్వగ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె. ఇవాళ మల్లికార్జున్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇలా పాపులర్ అయినవాళ్లలో ఒకరు చిన్నారి 'గద్వాల్ బిడ్డ'. కొన్నేళ్ల కిందట దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన ఓ టైటిల్ దుమారం చెలరేగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గద్వాల్ బిడ్డ చేసిన వీడియో అప్పట్లో తెగవైరల్ అయ్యింది.
తనను గద్వాల్ బిడ్డగా పరిచయం చేసుకున్న ఆ చిన్నారి.. ఆర్జీవి ప్రకటించిన టైటిల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు. ఆ సమయంలో దళితులను కించపర్చేలా వ్యవహరించాడంటూ దళిత కమ్యూనిటీలు ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మైనర్ కావడంతో పోలీసుల సమక్షంలో అతనితో క్షమాపణలు చెప్పించారు. కాగా ఆ సమయంలో అతని సంభాషణలు, ఏడుపు సైతం వైరల్‌గా మారింది.
అప్పటి నుండి కాస్తా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న.. అతని వీడియోలు మాత్రం మీమ్స్ క్రియేటర్లకు పని కల్పించాయి. మీమ్స్ టెంప్లేట్, స్టిక్కర్స్, ట్రోల్ వీడియోల్లో వైరల్ అయ్యాడు.
అయితే మీమ్స్ స్టార్ మృతిచెందిన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. గద్వాల్‌బిడ్డ అసలు పేరు మల్లికార్జున్‌రెడ్డి అని సమాచారం. ఇటీవల ఆ చిన్నారి ఓ సినిమాలో నటించాడు.
తర్వాతి కథనం
