నిర్మలా సీతారామన్ బడ్జెట్: సోషల్ మీడియాలో పేలిపోతున్న మీమ్స్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో సామాన్యుడికి ఏం వచ్చిందన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. కనీసం ఉద్యోగులకు సంబంధించి ఆదాయపన్ను పరిమితిలో ఏదయినా కుదింపు చేస్తారన్న ఆశతో చాలామంది ఎదురుచూసారు. కానీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అటువైపు తొంగిచూడలేదు.
దానితో మధ్యతరగతి వేతనజీవులు ఉస్సూరుమంటున్నారు. తమ పరిస్థితిపై సోషల్ మీడియాలో మీమ్స్ వదలుతున్నారు. బాహుబలి శివగామి, ఎదురుచూస్తున్న కార్మికులు అంటూ ఓ పోస్ట్ చూడండి ఇక్కడ.